అధిక ఉష్ణోగ్రతలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు మంచినీరు లభించడం లేదు. ఎండన బడి వస్తే వేడి నీరుతో గొంతు తడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
వేడి నీరు తాగుతున్న డ్రైవర్
By
Published : May 5, 2019, 5:51 PM IST
వేసవిలోనూ వేడీ నీరు
ఆర్టీసీ డ్రైవర్లకు కనీస సౌకర్యాలు అందిచండంలో అలసత్వం నెలకొంటుంది. మండే ఎండల్లోనూ విధులు నిర్వర్తించి గొంతు కడుపు కుందామంటే మంచినీరు లభించడం లేదు. కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ గ్యారేజీలో ఆర్టీసీ డ్రైవర్లు.. కండక్టర్లు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ఫ్రిజ్ పని చేయనందున వారికి వేడి నీరే దిక్కువుతోంది. అనేక పర్యాయములు ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులకు చెప్పిన స్పందన శూన్యం. ఇప్పటికైనా వేసవిలో చల్లని తాగు నీటిని అందించాలని డ్రైవర్లు కోరుతున్నారు.