రాజంపేట ఆసుపత్రికి రూ.12.6 కోట్లు మంజూరు - రూ.12.6 కోట్లు
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. రాజంపేట వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రిని రూ.12.6 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
రాజంపేట ఆసుపత్రికి రూ.12.6 కోట్లు మంజూరు
కడప జిల్లా రాజంపేట వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. రూ.12.6 కోట్లు మంజూరైన సందర్భంగా ఆస్పత్రిని పరిశీలించారు. అధునాతన వసతులతో ప్రతి పేదవాడికి కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు . ఇదే ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రం మంజూరైందని... త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.