ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన దుంగల పట్టివేత - police

బాలపల్లి  అటవీప్రాంతాన్ని టాస్క్​ఫోర్స్ బృందం కూంబింగ్ చేస్తుండగా.. అక్రమంగా తరలిస్తున్న 27 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు బృందంపై రాళ్లతో దాడిచేసి తప్పించుకున్నారు.

Redwood take over by the police at balapalli forest in railwaykoduru ,kadapa district

By

Published : Sep 4, 2019, 11:19 AM IST

కడపజిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని బాలపల్లి అటవీప్రాంతంలో టాస్క్​ఫోర్స్ బృందం కూంబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 30 మంది స్మగ్లర్లు ఎర్రచందన దుంగలు మోసుకెళ్తుండగా ..పోలీసులు అడ్డగించారు. దీంతో వారిపై రాళ్లు రువ్వి... స్మగ్లర్లు పారిపోయారు. అనంతరం అక్కడ వదిలేసిన 27 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని టాస్క్​ఫోర్స్ ఇంఛార్జ్ రవిశంకర్,డీఎస్పీ అల్లాబక్ష్ పరిశీలించారు.

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన దుంగల పట్టివేత

ABOUT THE AUTHOR

...view details