కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. ఇటీవల 27 దుంగలను స్వాధీనం చేసుకున్న కేసుకు కొనసాగింపుగా టాస్క్‌ఫోర్స్ ఇంఛార్జ్ రవి శంకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రైల్వేకోడూరు అటవీ ప్రాంతంలో మాటు వేసిన పోలీసులకు దుంగలు మోసుకెళ్తున్న వారు కనిపించారు. వారిని లొంగిపోవాలని హెచ్చరించగా పరారయ్యేందుకు యత్నించారు. తొలుత ఒకరిని పట్టుకున్న పోలీసులు... అతను చెప్పిన వివరాల ఆధారంగా ఇంకొకరిని పట్టుకున్నారు. వీరిద్దరూ స్మగ్లింగ్‌కు ఆర్థికంగా సహకరించే అందిస్తుంటారని ఇంఛార్జ్ రవిశంకర్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ బృందాన్ని డీఎస్పీ అల్లా బక్ష్ అభినందించారు.
ఎర్రచందనం అక్రమ రవాణా..ఇద్దరు అరెస్ట్ - illeagal
రైల్వేకోడూరులో ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న ఇద్దరు అరెస్ట్