రాజం పేట అటవీ డివిజన్ పరిధిలో 60 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల నాలుగు నుంచి మూడు రోజులపాటు వరసగా రోల్లమడుగు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు అటవీ డివిజన్ రేంజర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సమయంలో తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చిన స్మగ్లర్లు మూడు బృందాలుగా విడిపోయి ఎర్రచందనాన్ని అక్రమ రవాణాకు ప్రయత్నించినట్లు తెలిపారు . ఈ ప్రయత్నంలో స్మగ్లర్లు తమపై దాడి చేశారని... ఈ క్రమంలో లో ఒక బ్యాచ్ లోని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పట్టుకున్న ఎర్రచందనం విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ. 6.77 లక్షలు ఉంటుందని తెలిపారు. మార్కెట్లో దీని విలువ సుమారు 50 లక్షల రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రాజంపేటలో 60 ఎర్రం చందనం దుంగలు స్వాధీనం - smuggling
కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ పరిధిలోని రోల్లమడుగు ప్రాంతంలో భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను అక్రమ రవాణా చేయడానికి వచ్చిన ఆరుగురు సభ్యులను అరెస్టు చేశారు.
రాజంపేటలో 60 ఎర్రం చందనం దుంగలు స్వాధీనం