రేషన్ డీలర్లకు ఇబ్బందులు వస్తే పోరాటం చేసేందుకు అందరూ ఒక తాటి పైకి రావాలని కడప జిల్లా చౌక ధరల దుకాణాల సంఘం అధ్యక్షులు రామ్ మనోహర్ రెడ్డి కోరారు. కడపలోని నూర్జహాన్ సమావేశ మందిరంలో జిల్లా రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. గ్రామ వలంటీర్ల ద్వారా చౌకధరల దుకాణాల వస్తువులను సరఫరా చేసే విధానం అమలు చేసి.. తమను తొలగించాలని చూస్తే.. పోరాటం తప్పదన్నారు. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే వచ్చే సమస్యలపై చర్చించారు.
సమస్యలు వస్తే.. ఒక్కటై పోరాడదాం: రేషన్ డీలర్లు - meeting
కడపలోని నూర్జహాన్ సమావేశం మందిరంలో... జిల్లాపరిధిలోని రేషన్ డీలర్లు సమావేశమయ్యారు. తమ సమస్యలపై చర్చించారు.
రేషన్ డీలర్లు