'ప్రొద్దుటూరును జిల్లాగా ప్రకటించండి' - ycp
కొత్త జిల్లాల ప్రతిపాదనల్లో ప్రొద్దుటూరును జిల్లాగా ప్రకటించాలని స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
కడప జిల్లా ప్రొద్దుటూరును జిల్లాగా ప్రకటించాలని స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనల్లో ప్రాధాన్యం ఉన్న ప్రొద్దుటూరుకు చోటు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ను కోరారు. రాజకీయాలకు అతీతంగా వ్యాపార, కుల, ప్రజా సంఘాలు పోరాటం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా, వ్యాపార పరంగా ఎంతో పేరున్న ప్రొద్దుటూరును జిల్లాగా మారిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.