కడప జిల్లా పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానిక ఎమ్మల్యే కార్యాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వారి కష్టాలు చెప్పుకున్నారు. అవినాష్ రెడ్డి వారందరినీ పలకరిస్తూ వినతి పత్రాలను స్వీకరించారు. త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ - pulivendula
పులివెందులలో ప్రజాదర్బార్‌కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విన్నవించుకున్నారు.
పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్