ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

gold seez: కడప జిల్లాలో భారీగా బంగారు ఆభరణాల పట్టివేత - కడప జిల్లా ప్రధాన వార్తలు

కడప జిల్లా బి.కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 75 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవటంతో వ్యాపారి మణికంఠపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కడప జిల్లాలో రూ. 75 లక్షల బంగారు ఆభరణాలు పట్టివేత
కడప జిల్లాలో రూ. 75 లక్షల బంగారు ఆభరణాలు పట్టివేత

By

Published : Oct 12, 2021, 10:10 AM IST

కడప జిల్లా బి. కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వంకమరి చెక్​పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బద్వేల్ ఉపఎన్నికల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే ప్రొద్దుటూరు నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్తున్న ఓ కారులో రూ. 75 లక్షలు విలువ చేసే బంగారు అభరణాలు పట్టుబడ్డాయి. అయితే బంగారం కొనుగోలు చేసిన వ్యాపారి మణికంఠ వద్ద సరైన ఆధారాలు లభించకపోవటంతో బంగారం స్వాధీనం చేసుకుని అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details