అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి రెవెన్యూ డివిజన్లో.. వీరబల్లి, సుండుపల్లి మండలాలను కలపాలని చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. రాజంపేటలో తమ మండలాలు కలపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు మహా ర్యాలీ నిర్వహించారు. కొవిడ్ నిబంధనల వల్ల ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని.. ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతరం తమ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
సుండుపల్లిలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం - సుండుపల్లిలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి రెవెన్యూ డివిజన్లో వీరబల్లి, సుండుపల్లి మండలాలను కలపాలని స్థానికులు ర్యాలీ చేపట్టారు. రాజంపేటలో తమ మండలాలు కలపడాన్ని వ్యతిరేకిస్తూ.. చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక వాతావరణం నెలకొంది.
సుండుపల్లిలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు