ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేనానిపై అభిమానుల అసంతృప్తి!

కడప జిల్లా పర్యటనలో జనసేన అధినేత అందర్నీ కలుపుకొనిపోతున్నారు. గురువారం సాయంత్రం రాజంపేటలో రోడ్ షో చేశారు.

By

Published : Feb 28, 2019, 9:59 PM IST

రాజంపేటలో

రాజంపేటలో పవన్ రోడ్ షో
కడప జిల్లా పర్యటనలో గురువారం సాయంత్రం రాజంపేటలో పవన్ రోడ్ షో చేశారు.కడప నుంచి రోడ్డు మార్గంలో రాజంపేట చేరుకున్నారు. బోయిన్ పల్లి వద్ద అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బోయిన్ పల్లి నుంచి వాహనంలో అభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ రైల్వేకోడూరుకు వెళ్లారు. పదినిమిషాలు కూడా ఉండకుండా జనసేనానివెళ్లిపోయారు. అభిమాన నాయకుడిని చూడలేకపోయామని అభిమానులు నిరాశ చెందారు.

ABOUT THE AUTHOR

...view details