బెంగళూరు నుంచి కడపకు వచ్చిన ఆర్టీసీ బస్సులోని ప్రయాణికుడు మృతిచెందాడు. కడప డిపో బస్సు బెంగళూరు నుంచి బయలుదేరింది. అందులో ప్రసాద్ అనే యువకుడు ఎక్కాడు. బస్సు కడప బస్టాండ్‌కు వచ్చిన తరువాత ప్రయాణికులందరూ దిగినా అతను దిగలేదు. డ్రైవర్ వెళ్లి లేపగా స్పందించలేదు. ఆర్టీసీ అధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి పరిశీలించి ప్రసాద్ చనిపోయినట్లు నిర్ధరించారు. గుండెపోటుతో మరణించినట్లు అభిప్రాయపడ్డారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. అతని సెల్‌ఫోన్ ఆధారంగా ఎక్కడివాడనే విషయాలు పోలీసులు సేకరిస్తున్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి.. పోలీసుల దర్యాప్తు - కడపలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
బెంగళూరు నుంచి కడపకు వచ్చిన ఆర్టీసీ బస్సులోని ప్రయాణికుడు మృతిచెందాడు. బెంగళూరులో బస్సు ఎక్కిన అతను కడపలో దిగాల్సి ఉందని. అయితే అతను ఎంతకూ లేవకపోవటంతో డ్రైవర్ వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతిచెందిన ప్రయాణికుడు