ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధికి ఆమడ దూరంలో 'జ్యోతి క్షేత్రం' - government

దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన జ్యోతి క్షేత్రం పర్యాటకపరంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.  కడప జిల్లాలో ఏటా జరిగే ఆరాధనోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు  నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

By

Published : May 31, 2019, 4:38 PM IST

అభివృద్ధికి ఆమడ దూరంలో 'జ్యోతి క్షేత్రం'

కడప జిల్లాలోని దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన జ్యోతి క్షేత్రం పర్యాటక రంగం అభివృద్ధికి దూరంగా ఉంది. ఏటా ఇక్కడ జరిగే ఆరాధనోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పర్యాటకులు విశేషంగా వస్తారు. ఇతర రోజుల్లో కూడా టూరిస్టు బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపులలో యాత్రికులు వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ ఆహ్లాదం కలిగించే ప్రదేశాలు ఏవీ లేకపోవడంతో భక్తులు కేవలం దేవాలయం చూసి వెనుదిరుగుతున్నారు.

పురాతన కాలం నాటి జ్యోతి నరసింహ స్వామి క్షేత్రంతో పాటు భక్తుడు కాసినాయన ఆలయం కూడా ఉంది . 2018లో తెదేపా ప్రభుత్వం హయాంలో 2 కోట్లతో అటవీశాఖ అధికారులు పర్యాటక కేంద్రం రూపకల్పన చేశారు. జ్యోతి క్షేత్రానికి ప్రధాన రహదారి ప్రక్కనే వంద అడుగుల ఎత్తయిన కొండపై 50 హెక్టార్లు స్థలం సేకరణ చేశారు. ఇక్కడ పర్యాటకుల కోసం కుటీరాలు, మ్యూజియం, అటవీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు హోర్డింగులు, పార్కు నిర్మాణం చేపట్టారు. పర్యాటక భవనం, రహదారి, విద్యుదీకరణ, తాగునీటి సౌకర్యంలాంటి నాలుగు లక్షల విలువైన పనులు జరిగాయి. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో మిగిలిన పనులు కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల కోడ్ వచ్చే ముందు 70 లక్షల రూపాయన నిధులు విడుదలయ్యాయి. సకాలంలో నిధులు వచ్చి ఉంటే పనులు ఏడాదిలోపు జరిగేవి. నిధులు ఆలస్యంగా కారణంగా పనులు సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ అధికారులు వచ్చిన నిధులను వెనక్కి పంపారు. పర్యాటక కేంద్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇప్పటికైనా నూతనంగా ఎన్నికైన పాలకులు అభివృద్ధిపై దృష్టి సారించాలని పర్యాటకులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details