ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంటిమిట్ట శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు - UTSAVALU

కడపజిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు జరుగుతాయని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అధికారిక లాంఛనాలతో, తితిదే ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 18న రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు.

ఒంటిమిట్ట

By

Published : Feb 7, 2019, 11:06 PM IST

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 12న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
ఏప్రిల్ 13న ధ్వజారోహణం ఏప్రిల్ 14న హంసవాహనం
ఏప్రిల్ 15న సింహవాహనం ఏప్రిల్ 16న హనుమంత సేవ
ఏప్రిల్ 17 గరుడసేవ ఏప్రిల్ 18న స్వామి కల్యాణం
ఏప్రిల్ 19న రథోత్సవం ఏప్రిల్ 20 అశ్వవాహనం
ఏప్రిల్ 21న ధ్వజా అవరోహణం

ఏప్రిల్ 22న పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయని అధికారులు తెలిపారు. స్వామి వారి కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details