ఉల్లికి కూలీల కన్నీళ్లు - farmers
కడప జిల్లా, మైదకూరు కె.పి. ఉల్లి కొనుగోలు కేంద్రం వద్ద కూలీల నిరసతో ఉల్లి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉల్లి రైతులు మూడు రోజుల నుంచి మార్కెట్లోనే పడిగాల్పులు కాస్తున్నారు.
కడప జిల్లా, మైదుకూరు ఉల్లి రైతులకు కూలీల చిక్కొచ్చింది. హమాలీల నిరసన అసలుకే ఎసరుతీసుకొచ్చింది. తమకు ఇచ్చే కూలీ గిట్టుబాటు కావడం లేదని హమాలీలు ఆందోళనబాటపట్టారు. వారి తిరుగుబాటుతో మొత్తం కొనుగోళ్లే నిలిచిపోయాయి. 3రోజుల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎన్నో విజ్ఞప్తుల తర్వాత ఈ నెల 1న మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి కె.పి ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కాస్త ఉపశమనం లభించిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది.
ఈ నెల 1 నుంచి కేవలం 30 మంది రైతుల నుంచి 169 టన్నుల సరుకే కొనుగోలు చేశారు. సరిగ్గా ఉల్లి కొనుగోళ్లు ఉపందుకునే సమయానికి హమాలీలు నిరసన ఇబ్బంది పెడుతోంది.
కొనుగోలు కేంద్రంలో నిల్వ పేరుకుపోతుంటే... కూపన్లు పొందిన రైతులు యథావిధిగా సరకు తీసుకొస్తుంటడం ఆందోళనకలిగిస్తోంది. వారిని అధికారులు అనుమతించడం లేదు. ఫలితంగా జాతీయ రహదారిపైనే ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ఈటీవీ భారత్ రాకతో అధికారులు అప్రమత్తమై చర్యలు ప్రారంభించారు.