కడప జిల్లా ఎర్రబల్లిలో గత ఏడాది మే 3న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న డీఎస్పీ నారాయణస్వామి.. హత్యకు గల కారణాలను వెల్లడించారు. మృతురాలు సుమిత్రమ్మ తరచుగా తన కోడలు శ్వేతను వేధింపులకు గురిచేసేదని తెలిపారు. శ్వేత.. ఈ విషయాన్ని తన తల్లి ఇందిరమ్మ దృష్టికి తీసుకెళ్లింది. పథకం రచించిన ఇందిరమ్మ కిరాయి హంతకులతో కలసి సుమిత్రమ్మను హత్యచేయించారని పోలీసులు వెల్లడించారు. హత్యకు సంబంధించి.. శ్వేతతోపాటు ఆమె తల్లి ఇందిరమ్మ, నాగరాజు, రమేశ్ అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
వీడిన మహిళ హత్య మిస్టరీ...కోడలే హంతకురాలు ! - daughter in law murderer in kadapa
గతేడాది మే 3న కడప జిల్లా ఎర్రబల్లిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలి కోడలే తన తల్లితో కలిసి హత్యచేయించిందని గుర్తించారు. హత్యతో సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరిచారు.
వీడిన మహిళ హత్య మిస్టరీ...కోడలే హంతకురాలు