ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం... ఆరుబయటే అరుదైన విగ్రహాలు

చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఎన్నో విగ్రహాలు ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ శిథిలమైపోతున్నాయి. అద్భుత కళాఖండాలు.. నిర్లక్ష్యం నీడలో మరుగున పడుతున్నాయి. నిధులు ఉన్నప్పుడు స్థలం లేకపోవడం.. ఇప్పుడు స్థలం ఉన్నా నిధులు మంజూరు చేయకపోవడం.. చారిత్రక సంపద పాలిట శాపంలా మారింది.

By

Published : May 12, 2019, 10:03 PM IST

ఆరుబయటే అరుదైన విగ్రహాలు

ఆరుబయటే అరుదైన విగ్రహాలు

కడప జిల్లా మైలవరంలో 1976 అక్టోబర్ 9న పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. అప్పుడు సేకరించిన వస్తువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో బయటపడిన పురాతన శిల్పాలు ఒకచోట చేర్చారు. కొంత కాలం క్రితం ఆ ప్రదర్శనశాల శిథిలావస్తకు చేరగా.. నీటిపారుదల శాఖ భవనంలో తాత్కాలిక ప్రదర్శన చేస్తున్నారు.

రంగనాథ స్వామి, చెన్నకేశవులు, వీరభద్రుడు, శివలింగాలు, నాట్యమయూరి తదితర అపురూప విగ్రహాలు ప్రజలను ఆకట్టుకుంటున్నా... వాటికి సరైన చోటు లేకపోవడమే సమస్యగా మారింది. ప్రస్తుత మ్యూజియం భవనం పైకప్పు పెచ్చులూడి కూలేందుకు సిద్ధంగా ఉండడం.. విగ్రహాల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది.

మ్యూజియం భవనం శిథిలావస్థకు చేరినా... అందులోని విగ్రహాలను చూసేందుకు పర్యటకులు వస్తూనే ఉన్నారు. ఐదేళ్ల క్రితం నూతన భవన నిర్మాణానికి కోటి రూపాయల నిధులు మంజూరవగా... అప్పుడు స్థలం లేదు. ప్రస్తుతం స్థల సేకరణ జరిగినా... నిధులు లేక నూతన భవన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది.

పురావస్తు శాఖ అధికారులు... ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పక్కా భవనం నిర్మించాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.

ఇదీ చదవండి...

సర్వజన ప్రాంగణం... కన్నీటి సంద్రం

ABOUT THE AUTHOR

...view details