ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సబ్​ కలెక్టర్​

రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను కడప జిల్లా సబ్ కలెక్టర్ పృథ్వితేజ్ పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను నిస్పక్షపాతకంగా జరపాలని సిబ్బందికి సూచించారు.

kadapa vote counting arrangements
కడపలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సబ్​ కలెక్టర్​

By

Published : Mar 13, 2021, 4:32 PM IST

కడప నగరపాలక సంస్థ పరిధిలోని 26 డివిజన్ల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కడప జిల్లా సబ్ కలెక్టర్ పృథ్వితేజ్ తెలిపారు. కడప ఆర్ట్స్ కళాశాలలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్న ఆయన... మూడు కౌంటింగ్ కేంద్రాల్లో 39 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇందుకోసం ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, కమిషనర్ల సమక్షంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. రేపటి ఎన్నికల సందర్భంగా ఎలాంటి పక్షపాతం లేకుండా... లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

వెయ్యి ఓట్లకు ఒక రౌండు చొప్పున లెక్కింపు చేపడతామని సబ్ కలెక్టర్ తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బ్యాక్సులను స్ట్రాంగ్ రూంల నుంచి అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ కేంద్రాలకు తరలించి... ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత డివిజన్ ఓట్లు లెక్కించనున్నట్లు స్పష్టం చేశారు. మధ్యాహ్ననికి లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. జిల్లాలోని మిగిలిన చోట్లకూడా ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

సందడిగా ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు

ABOUT THE AUTHOR

...view details