ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కడప కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉదయం 9 గంటల నుంచి మూడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారందరినీ తనిఖీలు చేసి ఏపని మీద వెళ్తున్నారని వివరాలు అడిగి తెలుసుకుని కలెక్టరేట్లోకి పంపించారు. ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.
కలెక్టరేట్ వద్ద పోలీసుల మోహరింపు - కలెక్టరేట్
ఎమ్మార్పీఎస్ ఆందోళనల నేపథ్యంలో కడప కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. కలెక్టరేట్లోకి వెళ్లి ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించారు.
కడప కలెక్టరేట్‌ను భారీగా పోలీసుల మోహరింపు