ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో 'జగనన్న మహిళా మార్ట్' ప్రారంభం

పులివెందులలో రెండు వాటర్ ప్లాంట్లను, జగనన్న మహిళా మార్ట్​ను కడప ఎంపీ వైఎస్ అవినాష్​రెడ్డి ప్రారంభించారు. తక్కువ ధరలకు ఇక్కడ నిత్యావసర సరుకులు లభిస్తాయన్నారు.

By

Published : Jan 3, 2021, 5:13 PM IST

Mahila Mart in Pulivendula
జగనన్న మహిళా మార్ట్ ప్రారంభం

కడప జిల్లా పులివెందులలో రెండు వాటర్ ప్లాంట్లను, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద 'జగనన్న మహిళా మార్ట్' ఎంపీ అనివాష్​రెడ్డి ప్రారంభించారు. రిలయన్స్, మోర్ లాంటి సంస్థల కన్నా పది శాతం తక్కువ ధరలకు ఇక్కడ నిత్యావసర సరుకులు లభిస్తాయని ఎంపీ వైఎస్ అవినాష్​రెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళలందరూ కలిసి ఒక్కొక్క సభ్యురాలు రూ.150 చొప్పున కలెక్ట్ చేసి 15 లక్షల రూపాయలతో ఈ మార్ట్​ను ఏర్పాటు చేశారని ఎంపీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ సరుకులు కొనుగోలు చేస్తే కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగే అవకాశం ఉందని అవినాష్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details