రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.12 వేల 500 కోట్లు చెల్లించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి.. ఈ పథకం ద్వారా 64 లక్షల రైతన్నలకు సాయం అందిస్తామన్నారు. వీరిలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని మంత్రి వెల్లడించారు. రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8,750 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు.
64 లక్షల మందికి రైతు 'భరోసా': బుగ్గన - buggana
గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన ఆరోపించారు. రకరకాల సాకులు చూపి రుణమాఫీ ఎగ్గొట్టారన్నారు. వైకాపా రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పారు.
రైతు భరోసా పథకం ద్వారా 64 లక్షల రైతన్నలకు సాయం : మంత్రి బుగ్గన
తెదేపా ప్రభుత్వ హయాంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.87వేల కోట్ల రైతు రుణాలు ఉంటే.. రకరకాల సాకులు చూపించి..24వేల కోట్లకు కుదించారన్నారు. రుణమాఫీ కోసం రూ.16,512 కోట్లు కేటాయించి..వాటిలో కేవలం రూ.10,279 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు.
ఇదీ చదవండి : 'మద్యపాన నిషేధానికి తొలి అడుగు పడింది'