ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరు ఆసుపత్రి ఆధునీకరణ - mri

నిరుపేద రోగులకు అధునాత వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. కడప జిల్లా ప్రొద్దుటారు ఆస్పత్రిలో ఆధునిక సౌకర్యాలను మంత్రి ప్రారంభించారు.

ప్రభుత్వాస్పత్రి

By

Published : Feb 28, 2019, 10:40 PM IST

ప్రొద్దుటూరు ఆస్పత్రిలో మంత్రి ఆదినారాయణరెడ్డి
ఆస్పత్రికి వచ్చే నిరుపేద రోగులకు అత్యున్నత వైద్యం అందించటమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐతో పాటు.. మరిన్ని అధునాతన యూనిట్లను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో 11 చోట్ల ఎంఆర్ఐ సదుపాయాన్ని కల్పించామని తెలిపారు.ఔట్ సోర్సింగ్ ద్వారా వైద్య పరికరాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామన్నారు.ప్రొద్దుటూరు ఆస్పత్రిలో 7 కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయటం మంచి పరిణామంగా చెప్పారు. ఎవరైనా రోగుల వద్ద సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details