ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెలుగుదేశంతోనే పులివెందుల సస్యశ్యామలం' - minister aadi

కడప జిల్లా పులివెందుల అభివృద్ధికి తెదేపా తెచ్చిన కృష్ణా జలాలే కీలకమని కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, అసెంబ్లీ సతీష్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా నేతలు... అభివృద్ధి చేసేవారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

minister aadi

By

Published : Apr 4, 2019, 5:09 PM IST

కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గాన్ని దక్కించుకోవటమే లక్ష్యంగా తెదేపా నేతలు ప్రచారంలో జోరు పెంచారు. లింగాల మండలం పార్నపల్లిలో లోక్‌సభ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కృష్ణా జలాలు అందించిన ఘనత తెదేపాదేనని గుర్తు చేసిన నేతలు... ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే తెలుగుదేశానికి ఓట్లు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఏడాదికి 5 మార్లు వచ్చి పోయే వ్యక్తి కావాలో... సంవత్సరానికి 250 రోజులు అందుబాటులో ఉండే నాయకుడు కావాలో...ఆలోచించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details