ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉల్లి రైతులకు కన్నీరు... దళారుల జేబుల్లోకి లాభాలు

కడప జిల్లా ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అకాల వర్షాల కారణంగా పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. మార్కెట్​లో మాత్రం ధరలు పలుకుతున్నా రైతులకు లాభం అందడం లేదు. తక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేస్తున్న దళారులు ఎక్కువ లాభాలు అర్జిస్తున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు.

By

Published : Oct 21, 2020, 4:00 PM IST

Published : Oct 21, 2020, 4:00 PM IST

onion farmers in Kadapa district
onion farmers in Kadapa district

కడప జిల్లా ఎర్రగుంట్ల, వీరపునాయునిపల్లె, మండలాల్లోని ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలకు 75 శాతం మేర పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఉల్లిధరలు ఆకాశం అంటుతున్నాయి. ఎర్రగుంట్ల రైతు బజార్ లో మాత్రం చిన్న సైజు ఉల్లి కిలో 40 నుంచి 50 రూపాయల వరకు మరి కొంచెం పెద్ద సైజు 70 నుంచి 80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.

ఇంతమేర ధరలు పలుకుతున్నా... రైతన్నల కష్టాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఓ వైపు తాము కన్నీరు పెడుతుంటే.. దళారులు మాత్రం బాగుపడుతున్నారని ఉల్లి రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని... దళారులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details