ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేంపల్లిలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య - వేంపల్లిలో వివాహిత ఆత్మహత్య

కడప జిల్లా వేంపల్లిలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

women sucide at vempally
వేంపల్లిలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

By

Published : Sep 29, 2020, 1:59 PM IST

కడప జిల్లా వేంపల్లిలోని గండిరోడ్డులో సుజాత అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికు చెందిన సుజాత, వేంపల్లివాసితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాత్రి సుజాత ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త ఉదయం నిద్రలేచి చూడగా...మృతి చెందినట్లు చెబుతున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా స్ధానిక గండి రోడ్​లో బట్టల షాప్ పెట్టుకుని జీవనం సాగించేవారు.

ఇదీ చదవండి:

న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దాడి: చంద్రబాబుకు డీజీపీ లేఖ

ABOUT THE AUTHOR

...view details