రేపు ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన - Kadapa
కడపలో ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రేపు శంకుస్థాపన జరగనుంది. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, రవాణశాఖ మంత్రి పేర్నినాని దీనికి శంకుస్థాపన చేయనున్నారు.
కడప ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన
కడపలో ఆర్టీసీ కార్మికుల కోసం 3 కోట్ల రూపాయలతో 30 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణం కోసం రేపు శంకుస్థాపన జరగనుంది. గతంలో దీనిని తిరుపతిలో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే కడపలో ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యూనియన్ నాయకులు ఆర్టీసీ ఎండీకి సూచించారు. రేపు ఉదయం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రవాణశాఖ మంత్రి పేర్ని నాని సమక్షంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Last Updated : Jun 28, 2019, 5:41 PM IST