అన్యాయం జరిగితే పెద్దలే కాదు.. చిన్నారులూ రోడ్డెక్కి ఆందోళన చేస్తారు అనడానికి ఉదాహరణే ఈ ఘటన. కడప వైఎస్సార్ క్రీడా పాఠశాలలో తమకు అన్యాయం జరిగిందని నాలుగో తరగతి విద్యార్థులు ధర్నా చేపట్టారు. అర్హులైన తమను కాదని 5, 6 తరగతుల విద్యార్థులకు సీట్లిచ్చారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. స్పోర్ట్స్ స్కూల్ అధికారి డీఎస్డీవోపై విచారణ చేయించి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని గోముగా వేడుకున్నారు. చిన్నారుల నిరసన తీరు చూపరులను ఆలోచింపజేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పట్టుమని పదేళ్లు లేవు.. ధర్నా చేస్తూ రోడ్డెక్కారు పాపం! - AP LATEST
ఆటలాడుకోవాల్సిన వయసులో.. న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. హాయిగా పాటలు పాడుకోవాల్సిన గొంతుతో నినాదాలు చేశారు. మైదానంలో బ్యాట్ పట్టుకోవాల్సిన చిట్టి చేతులతో.. బ్యానర్లు పట్టుకుని ఆందోళన చేశారు. వీరంతా ఎవరో కాదు పట్టుమని పదేళ్లు నిండని.. కడప జిల్లా చిన్నారులు. అసలేం జరిగిందంటే..!
ధర్నా చేస్తూ రోడ్డెక్కారు పాపం!