ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనపడని భౌతిక దూరం.. డ్వాక్రా సభ్యుల నిర్లక్ష్యం - మెప్మా కార్యాలయం వద్ద గుంపులు గుంపులుగా డ్వాక్రా సంఘ సభ్యులు

సుమారు నెల రోజులుగా లాక్ డౌన్ అమలవుతోంది. కరోనా వేగంగా విజృంభిస్తోంది. అయినా ప్రజల్లో నిర్లక్ష్య దోరణి వీడలేదు. కడప జిల్లా జమ్మలమడుగు మెప్మా కార్యాలయం వద్ద గుంపులు గుంపులుగా డ్వాక్రా సంఘ సభ్యులు గుమిగూడి ఉండటమే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

kadapa district
కనపడని భౌతిక దూరం?

By

Published : Apr 23, 2020, 4:37 PM IST

కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు ఎక్కువవుతోంది. సుమారు నెల రోజులుగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రమాదం వేగంగా తరుముతున్న కొన్నిచోట్ల కొందరు ఎటువంటి నిబంధనలు పాటించటం లేదు. కడప జిల్లా జమ్మలమడుగు మెప్మా కార్యాలయం వద్ద గుంపులు గుంపులుగా డ్వాక్రా సంఘ సభ్యులు గుమిగూడి ఉండడం అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

బుధవారం సాయంత్రం మెప్మా కార్యాలయంలో మాస్కూలు తయారు చేసే విషయమై అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది డ్వాక్రా సంఘ సభ్యులు హాజరయ్యారు. సమావేశం అనంతరం సామాజిక దూరం పాటించకుండా 200 మంది సభ్యులు దగ్గర దగ్గరగా ఉంటూ మాట్లాడుకోవటం ఆందోళన కలిగించింది. మెప్మా అధికారులు సైతం ఈ విషయాన్ని పట్టించుకోకపోవటంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details