Bridge Problems: కడప నగరంలో బుగ్గ వంక ప్రవహిస్తోంది. గతంలో వర్షాల వల్ల దీనికి వరదలు వచ్చాయి. వరద ప్రవాహం పెరగటంతో దాని చుట్టు పక్క ప్రజలు నష్టపోయారు. వరద తాకిడి నుంచి రక్షణ కోసం దాని చుట్టూ రక్షణ గోడ నిర్మించారు. గోడ నిర్మించక ముందు కాజ్ వే ఉండేది. దానిలోంచి ప్రజలు నగరంలోకి వెళ్లేవారు. ఇప్పుడు గోడ నిర్మించటంతో కాజ్వే లు కనుమరుగయ్యాయి. దీంతో రవీంద్రనగర్, మరియాపురం, మరాఠి వీధి, కాగితాల పెంట, శ్రీరాముని వీధి, సంక్షేమ కాలనీ ప్రజలు నగరంలోకి వెళ్లాలంటే మురుగు నీటి గొట్టాల్లో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి.
ఆ ప్రజలు ఊర్లోకి వెళ్లాలంటే.. అవస్థలు పడాల్సిందే - Bugga Vanka Safe Wall
Bridge Problems: ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ప్రజలు బుగ్గవంకపై వంతెన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుగ్గ వంక చూట్టు రక్షణ గోడ నిర్మించటంతో దారే లేకుండాపోయింది. దీంతో మురుగు నీటి గొట్టం నుండి నగరంలోకి వెళ్తున్నారు. వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
నగరంలో బుగ్గ వంక చుట్టూ రక్షణ గోడ నిర్మించిన అధికారులు.. చిన్నపాటి వంతెన కూడ నిర్మించలేదు. దీంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. చట్టూ తిరిగి వెళ్తే సుమారు అరగంట సమయంతో పాటు.. వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. గత్యంతరం లేక పిల్లలు, పెద్దలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు అందరూ మురుగు నీటిగొట్టం లోపల నుంచి మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్తున్నారు. మురుగు నీటిలో చేతులు పెట్టి అతి కష్టం మీద దానిలోంచి బయటికి రావాల్సి వస్తోంది. మురుగు నీటి గొట్టం నుంచి వెళ్లడం ఇబ్బందికరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చిన్నపాటి వంతెన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: