పార్టీ నేతలతో రిటర్నింగ్ అధికారి సమావేశం - మైదుకూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మైదుకూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న ఓట్ల లెక్కింపులో ఏజెంట్ల నియామకం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించారు.
కడప జిల్లా మైదుకూరు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో ఈసీ అధికారులు రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో తీసుకోవాల్సిన చర్యలను గురించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సతీష్ చంద్ర, సహాయ ఎన్నికల అధికారి శివరాముడు వివరించారు. నేరాలతో సంబంధం ఉన్న వారిని ఏజెంట్లుగా పెట్టుకోవద్దని నేతలకు సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లకు చరవాణిని అనుమతించరని, పేపరు, పెన్నును కౌంటింగ్ కేంద్రంలోనే ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలని పక్క టేబుల్ వద్దకు వెళితే వారిని బయటకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు.