కడప దర్గా సందర్శించిన అఖిల ప్రియ - kadapa
కడప దర్గను మంత్రి అఖిల ప్రియ సందర్శించారు. దర్గాలో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. ఆళగడ్డ ప్రజలందరిపై దేవుడు ఆశీస్సులు ఉండలని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ పగ్గాలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.
ఆళ్లగడ్డ ప్రజలందరిపై దేవుడు ఆశీస్సులు ఉండాలని కడప పెద్ద దర్గాని అఖిల ప్రియా రెడ్డి సందర్శించారు. దర్గా నిర్వాహకులు ఆమెకు ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దర్గాలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిర్వాహకులు ఆమెకు దర్గా విశిష్టత గురించి తెలియజేశారు. పూల చాందిని సమర్పించారు. ఈనెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తాయని పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.