కడప జిల్లాలో వైద్యవిధాన పరిషత్ కింద జిల్లా ఆసుపత్రి, మరో ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం, 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. డీసీహెచ్ఎస్ అధికారి పాలనలో నడుస్తుంటాయి. డీసీహెచ్ఎస్ ఆసుపత్రిని తనిఖీ చేస్తే రవాణా భత్యం కింద ప్రభుత్వం 450 రూపాయలు చెల్లిస్తుంది. బద్వేలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ అశోక రాజు డీసీహెచ్ఎస్కు ఫిర్యాదులు చేశారు. ఆమె రాకపోవడంతో అనుమానం వచ్చి స.హ. చట్టం ద్వారా జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు నడుస్తున్నాయని తెలుసుకున్నారు.
అక్కడ తనిఖీలకు వెళ్లకున్నా..వెళ్లినట్లే! - కడప జిల్లా
వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి యథేచ్ఛగా సాగుతోంది. ఆసుపత్రుల తనిఖీలకు వెళ్లకుండానే వెళ్లినట్టు రికార్డు సృష్టించి జేబులు నింపేసుకుంటున్నారు. కడప జిల్లాలో స.హ. చట్టం ద్వారా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
2017 డిసెంబర్ నుంచి 2018 అక్టోబర్ వరకూ ఎప్పుడెప్పుడు డీసీహెచ్ఎస్ ఆస్పత్రులను తనిఖీ చేశారనే విషయాన్ని తెలుసుకున్నారు. బద్వేలు సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీకి రాకుండానే తనిఖీ చేసినట్లు పెద్ద ఎత్తున రవాణా భత్యం క్లెయిమ్ పేరుతో నిధులు దారి మళ్లించినట్టు తెలిసింది. ఆసుపత్రి తనిఖీ చేస్తే అటెండెన్స్ రిజిస్టర్లో సదరు అధికారి సంతకం ఉండాలి. అలా సంతకాలు లేవు. క్లెయిమ్ చేసిన దానికి రిజిస్టర్లో ఉన్న వివరాలకు పొంతన లేదు. ఈ విషయాన్ని అశోక్ రాజు మీకోసం కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.