ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో పేట్రేగిపోతున్న కబ్జాదారులు... - రైల్వేకోడూరు

ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. పోరంబోకు స్థలం చూస్తే వాళ్లకు పండగే... కబ్జాదందాతో కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతం మాయమైపోతోంది. అధికారులు నిర్లక్ష్యంతో ఎకారాల కొద్దీ భూమి ఆక్రమార్కులచేతిలోకి పోతుంది.

కడపలో పేట్రేగిపోతున్న కబ్జాదారులు...

By

Published : Aug 30, 2019, 10:22 AM IST

కడపజిల్లా రైల్వేకోడూరు ప్రాంతంలో కొందరు మధ్యవర్తులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. పట్టణం సమీపంలోని వంక పొరంబోకును కబ్జా చేసేందకు జేసీబీతో చదును చేసి... ఏకంగా మామిడి మొక్కలు నాటారు. ఓబులవారిపల్లి, చిట్వేలి, పుల్లంపేట మండలాలల్లోనూ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైపోతోంది. రైల్వేకోడూరులోని వంక పోరంబోకు, దేవుడి మాన్యాలు, బంజరు భూములపై కబ్జాదారుల కన్ను పడిందని ప్రజలువాపోతున్నారు. అధికారుల అండదండలు చూసుకుని ఆక్రమార్కులు పేట్రేగిపోతున్నారని తెలిపారు.

ఈ అక్రమాలకు సంబంధించి తహశీల్దార్ శిరీషను వివరణ కోరగా ... సిబ్బందిని అప్రమత్తం చేసి స్థలాన్ని కబ్జా చేయకుండా చూశామని, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ స్థలంలో సూచికలు ఏర్పాటు చేసి స్థలం చుట్టూ కంచె వేస్తామని చెప్పారు.

ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణలకు ముక్కుతాడు వేయకపోతే.... కబ్జా దారులు రెచ్చిపోయే ప్రమాదం ఉంటుందని అభిప్రాయం గ్రామస్థులలో వ్యక్తం అవుతోంది.

కడపలో పేట్రేగిపోతున్న కబ్జాదారులు...

ఇదీచూడండి

6 లక్షలు దాచాడు... పేదోడిగా మరణించాడు!

ABOUT THE AUTHOR

...view details