కడప జిల్లా కమలాపురంలో 2011 సంవత్సరంలో కమలకూరు వద్ద సగిలేరు నదికి అడ్డంగా 12 కోట్ల తో ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణం కారణంగా 120 ఎకరాల వ్యవసాయ భూమిని రైతులు కోల్పోయారు. 80 ఎకరాల భూమికి పరిహారం చెల్లించారు. మిగిలిన భూమికి ఇంకా పరిహారం చెల్లించలేదు . డీకేటీ భూమి, ఎకరాకు లక్ష 25 వేల నుంచి 50 వేల వరకు, రిజిస్ట్రేషన్ భూమికి రెండున్నర లక్షల పరిహారం చెల్లించారు. కమలకూరు ఆనకట్ట కింద రెండు వేల ఎకరాల వ్యవసాయ భూమికి నీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇప్పటి వరకూ పనులే జరగలేదు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకపోవటంతో రైతులు అన్ని విధాల నష్టపోయారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు కమలకూరు ఆనకట్ట నిర్మాణం పనులు పూర్తి చేసి ...భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. వదిలేసిన నిర్మాణ పనులు తిరిగి చేపట్టి, అందరికీ ఉపయోగపడేలా త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతున్నారు.
ఆనకట్టలు పూర్తిచేయండి సారూ...? - కడప జిల్లా
ఎన్ని ప్రభుత్వాలు మారినా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే జలాశయాల రూపురేఖలు మాత్రం మారడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జలాశాయాలు,ఆనకట్టల నిర్మాణం.. అంటూ ఎన్ని చెప్పినా.. చివరకు చూస్తే అంతా అసంపూర్తి పనులే దర్శనమిస్తున్నాయి. 2011లో మొదలుపెట్టిన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తవ్వలేదు. దీనిమీద ఆధారపడ్డ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆనకట్టల నిర్మాణంలో అసంతృప్తి