కడప జిల్లా కోడూరు గ్రామస్థులు.. ఎర్రగుంట సమీపంలోని జువారి సిమెంటు కర్మాగారానికి ఎదురుగా ఆందోళన చేశారు. 6 గ్రామాలకు తాగునీరు అందించే నదిలోకి సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి రసాయనాలు వదులుతున్నారని నిరసనకు దిగారు. ఈ ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలు తమ గ్రామాలను కాలుష్యమయం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట కోడూరు ప్రజల ఆందోళన - కోడూరు
సిమెంట్ ఫ్యాక్టరీలోని వ్యర్థ పదార్థాలను తమ గ్రామంలోకి వదులుతున్నారని కడప జిల్లా కోడురు గ్రామస్థులు... జువారి సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు.
ఆందోళన చేస్తున్న ప్రజలు