పొలానికి గండి..రైతుల గుండెలో అలజడి కడప జిల్లా మైదుకూరు పురపాలక పరిధిలోని గడ్డమాయపల్లె సమీపంలో మన్యం రమేష్ రెడ్డి అనే రైతుకు చెందిన పొలంలో రెండు రోజుల కిందట భారీ గండి పడింది. దాదాపు 25 అడుగుల వెడల్పు, 30 నుంచి 40 అడుగుల లోతుతో గొయ్యి పడింది. రోజురోజుకు పెరిగి సుమారు 60 అడుగులకు చేరింది. గండిని పడటానికి కారణం ఏంటో అంతు పట్టడం లేదని రైతు చెబుతున్నాడు. చుట్టూ వరి పొలాలు ఉండటంతో గొయ్యిలోకి ఊట నీరు చేరుతోంది. గతంలో గ్రామ పరిసరాల్లో రెండు చోట్ల ఇలాంటి గోతులే పడినట్లు రైతులు చెబుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. భూమిలో గోతులు పడటానికి కారణాలను అన్వేషించాలని అధికారులను కోరుతున్నారు.
ఇదీ చూడండి: