కడప జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు, కుంటలకు భారీగా నీరు చేరి.. అలుగులు పారటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. గురువారం రాత్రి జిల్లాలోని సంబేపల్లి మండలంలో అత్యధికంగా 117. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెన్నా, కుందు, పాపాగ్ని, బాహుదా, మాండవ్య నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గండికోట, మైలవరం ప్రాజెక్టులు నిండిపోవటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరద నీటితో పంటలు మునిగిపోయాయి. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
భారీ వర్షాలతో నిండిన కుంటలు, చెరువులు - lakes
నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే కడప జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాతలో వాగులు వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.
భారీ వర్షాలు