కడప జిల్లా జమ్మలమడుగులో భారీ వర్షం కురిసింది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం సాయంత్రం జమ్మలమడుగు పట్టణంలో కురిసిన వర్షానికి బీసీ కాలనీ, శబరి కాలనీ, నెహ్రూ నగర్, వెంకటేశ్వర కాలనీ , శివారెడ్డి నగర్ తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గతంలో ఎప్పుడో ఏర్పాటు చేసిన కాలువలు పూడిపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతున్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి కాలువలను వెడల్పు చేస్తే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు చెబుతున్నారు.
జమ్మలమడుగులో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - జమ్మలమడుగులో వర్షాలు
కడప జిల్లా జమ్మలమడుగులో భారీ వర్షం కురిసింది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని వీధుల్లో వర్షపు నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరటంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.
జమ్మలమడుగులో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం
ఇదీ చదవండి: