కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. ప్రజలు ఇబ్బందులను గుర్తించిన చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహప్రసాద్ నాలుగు వందల కుటుంబాలకు ఆహార పొట్లాలను అందించారు. ఓబులవారిపల్లె మండలంలో రైతులను పరామర్శించారు. తుపాన్ దాటికి నేలమట్టమైన అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైకాపా ఎమ్మెల్యే తన సొంత గ్రామంలో బ్రిడ్జిని కూడా నిర్మించలేదని విమర్శించారు.
కడప జిల్లాలో భారీ వర్షాలు.. ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు - రైల్వే కొడూరులో భారీ వర్షం
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వేకోడూరు నియోజకవర్గంలో రైతులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది.
బాధితులకు ఆహార పొట్లాలను అందిస్తున్న నరసింహ ప్రసాద్