కడప జిల్లా బద్వేలులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలుల ధాటికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. రహదారుల్లో వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోయింది. వర్షంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. దూదేకుల వీధిలోని పలు ఇళ్లలోకి వర్షపునీరు చేరింది.
బద్వేల్లో వర్ష బీభత్సం... ఇళ్లలోకి చేరిన నీరు - kadapa
ఈదురుగాలులతో కూడిన వర్షం కడప జిల్లా బద్వేలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. పట్టణంలో వరుణుడు సృష్టించిన వర్ష బీభత్సానికి పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరాయి.
వర్ష బీభత్సం