Heavy Rain in Kadapa and Kurnool District :కొన్ని రోజులు క్రితం భారీ వర్షాలు పడటంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడ్డారు. గురువారం తెల్లవారుజాము నుంచి రెండు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడ్డాయి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
Heavy Rain in Kadapa and Kurnool District : వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కడప నగరంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికినగరం జలమయమైంది. నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీరు భారీగా చేరింది. కడపలోని చెన్నై రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు రోడ్డు, అంబేద్కర్ కూడలి, భగత్ సింగ్ నగర్, గంజికుంట కాలనీ, అక్కయ్యపల్లి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కయ్యపల్లెలోని పాత గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళన గురయ్యారు.
Heavy Rains in AP: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వానలు.. బీభత్సం సృష్టిస్తోన్న వరదలు..
Heavy Rain in Kadapa and Kurnool District :కర్నూలులో ఈ రోజు ఉదయం కురిసిన వానకు కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటన్నర పాటు కురిసిన వర్షానికే నగరం జలమయం కావడంతో.. ఇక ఏకధాటిగా ఒక రోజు పాటు వర్షం కురిస్తే నగరం పరిస్థితి ఏమంటూ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మురికి కాలువలు వరద నీటితో నిండిపోయాయి.