నేడు హజ్ హౌస్ ప్రారంభం
ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కడపలో నిర్మించిన హజ్ హౌస్‌ను మంత్రి ఫరూక్ ప్రారంభించనున్నారు.
పుత్తా నరసింహారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం కడప జిల్లాలో ప్రతిష్ఠాత్మంకంగా నిర్మించిన హజ్ హౌస్‌ను నేడు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ప్రారంభించనున్నారు. హజ్ హౌస్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కమలాపురం తెదేపా బాధ్యులు పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుందని పుత్తా వ్యాఖ్యనించారు. కార్యక్రమం అనంతరం ముస్లింల ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.