కడప స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు భారీ ఎత్తున అంతర్రాష్ట్ర మద్యాన్ని, గుట్కా ప్యాకెట్లను(Gutka, liquor seized) పట్టుకున్నారు. కర్ణాటక నుంచి కడపకు తరలిస్తున్న 1092 మద్యం సీసాలను, 11,000 నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు(two persons arrest) చేసి.. కారును సీజ్ చేశారు. పట్టుబడిన మత్తు పదార్థాల విలువ రూ.లక్ష వరకు ఉంటుందన్నారు.
Gutka, liquor seized: భారీగా నిషేధిత గుట్కా, మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్టు - కడప జిల్లా వార్తలు
కడప జిల్లా(Kadapa district)లో స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పెద్ద ఎత్తున కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిషేధిత గుట్కా, మద్యాన్ని(Gutka, liquor seized) పట్టకున్నారు. ఓ కారును సీజ్ చేసి.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన మత్తు పదార్థాల విలువ రూ.లక్ష వరకు ఉంటుందన్నారు
నిషేధిత గుట్కా, మద్యం పట్టివేత
కర్ణాటక రాష్ట్రం నుంచి కడప జిల్లాకు అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావటంతో స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో అధికారులు కడప శివారులో నిఘా పెట్టారు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి ఓ కారులో నిషేధిత గుట్కా, మద్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడింది.
ఇదీ చదవండి