కడప జిల్లాలో ఖరీఫ్ కింద 2018-19 సంవత్సరానికి 1.16 లక్షల హెక్టార్లలో సుమారు 17 రకాల పంటలు రైతులు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ పంటల్లో వేరుశెనగను 40 వేల హెక్టార్లలో... జిల్లాలోని 28 మండలాల్లో చేస్తారని ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వం కడప జిల్లాకు 32 వేల క్వింటాల వేరుశెనగ విత్తనాలు మంజూరు చేసింది. కానీ దానిలో 15 వేల క్వింటాలే వచ్చాయి. దీంతో కొందరి రైతులకు విత్తనాలు ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదనకు గురౌతున్నారు.
విత్తనాల కొరతతో రైతులు ఆవేశానికిలోనై కార్యాలయానలు ముట్టడిస్తున్నారు. ఆధికారులను నిలదీస్తున్నారు. రోడ్డుపై బైఠాయిస్తున్నారు. లక్కిరెడ్డిపల్లిలో గోదాంలో విత్తనలు లేవన్న విషయం తెలుసుకుని రైతులు ఆందోళనకు దిగి అధికారులను చుట్టుముట్టారు. భయం ఆ అధికారులు... పోలీస్ స్టేషన్కు పరుగులు తీయాల్సి వచ్చింది. చివరికి వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ కలుగుజేసుకొని త్వరలోనే రెండో విడత విత్తనాలు తెప్పించి పంపిణీ చేస్తామన్న హామీతో రైతులు శాంతించారు.