ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వేరుశనగ విత్తనాల పంపిణీలో ఇంత అలసత్వమా?'

By

Published : Jan 7, 2021, 7:13 AM IST

కడప జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీలో అధికారుల అలసత్వంగా వ్యవహరిస్తున్నారంటూ.. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో రైతులందరికీ విత్తనాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.

govt chief whip srikanth reddy  meeting
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయశాఖాధికారులతో సమావేశం

కడప జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీలో అధికారుల అలసత్వం, పంట నష్ట వివరాల సేకరణలో జరిగిన లోపాలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలోని ఆర్ అండ్ బీ అతిధి గృహంలో వ్యవసాయశాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు మేలు జరిగే విషయాలలో అధికారులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు నెలలోపే పరిహారం అందించారన్నారు.

రాయచోటి నియోజకవర్గానికి 17 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సరఫరా చేశారన్నారు. గోడౌన్​లలో ఉన్న నిల్వలను వేరుశనగ విత్తనాలను పంట వేసుకునే రైతులందరికీ రెండు మూడు రోజుల్లో పంపిణీ చేయాలని శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. విత్తనాల పంపిణీలో అవినీతికి పాల్పడ్డ వారిపై ఎర్రచందనం అక్రమ రవాణాలో పెడుతున్న పీడీ యాక్ట్ కంటే కఠిన శిక్షలను అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details