ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి'

అప్పుల బాధ తాళలేక కడప జిల్లాలోని రంగాపురం గ్రామానికి చెందిన పాల్​రెడ్డి అనే మృతి రైతు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

government should take care of dead farmer family says kadapa tdp president srinivas reddy
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలన్న కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు

By

Published : Apr 19, 2020, 8:55 PM IST

కడప జిల్లా పులివెందులలోని రంగాపురం గ్రామానికి చెందిన రైతు అప్పుల బాధ తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు పాల్​రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీని పంటలు ఎగుమతి చేసుకోవడానికి పులివెందులలో అధికారులు అనుమతి ఇవ్వని కారణంగానే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. లాక్ డౌన్ కారణంగా పంటల ఎగుమతికి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details