కడప జిల్లా రాయచోటిలోని గోవింద్ కేర్ సెంటరను శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానం పరిశీలించారు. వైరస్ బాధితులకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్నారు.
వారికి సేవలు అందాలనే కేర్ సెంటర్..
కరోనా బాధితులకు స్థానికంగానే వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అనంతరం కొవిడ్ బాధితులకు సేవా సంస్థ అందించిన కంగెన్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కంగెన్ వాటర్‌తో శరీరానికి అధిక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
రోగనిరోధక శక్తిని ఇస్తుంది..
శరీరంలోని వ్యర్థ, విషతుల్యాలను ఇది తొలగిస్తుందన్నారు. శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అత్యధిక స్థాయిలో అందిస్తుందని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక లీటర్ కంగెన్ వాటర్ వంద ఆపిల్స్ తో సమానమని వివరించారు. కరోనా బాధితులకు కంగెన్ వాటర్ మంచి శక్తిని ఇస్తుందని చెప్పారు.