కడప జిల్లా బద్వేల్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో భోజనశాల లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం తినే సమయంలో గాలికి దుమ్ము లేచి ఆహారం మీద పడుతుంది. అంతేగాక ఎండలో, వర్షం వచ్చినపుడు చెట్ల కింద, తరగతి గదిలోకి వెళ్లి తినాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3వేల 225 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో లక్షా75వేల 311 బాలబాలికలు చదువుకుంటున్నారు. చాలా పాఠశాలలో భోజనశాల కొరత కనిపిస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.
భోజనాలు పెట్టారు సరే... తినేందుకు స్థలమేది? - lack ofdining facilities
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సౌకర్యాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప జిల్లాలో బద్వేలు సర్కారు బడి పిల్లలు చెట్ల కిందే తింటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే భోజనశాల నిర్మించాలని వేడుకుంటున్నారు. ఒక్క బద్వేలులోనే కాదు జిల్లా వ్యాప్తంగాను ఇదే పరిస్థితి ఉంది.
governement school didnot have dining facilities