కడపలో వైభవంగా దసరా వేడుకలు..కోలాటాలతో అలరించిన మహిళలు కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పట్టణంలో వై.ఎం.ఆర్ కాలనీలోని రాజరాజేశ్వరి దేవి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తొలిరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శమివ్వగా రెండవ రోజు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు.ఆలయ ఆవరణలో వివిధ భక్తి పాటలకు మహిళలు చేసిన కొలాట నృత్యం అందరిని ఆకట్టుకుంది. ఆలయ నిర్వాహకులు, కొలాట నృత్య శిక్షకులైన శ్రవణ్‌ను సన్మానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: