గాలివాన బీభత్సం... పాడి గేదె మృతి - గాలివాన బీభత్సం...పాడి గేదె మృతి
కడప జిల్లా టి.వెలమవారిపల్లెలో గాలివాన సృష్టించిన బీభత్సానికి ఓ గేదె మృతి చెందింది. ఓ వ్యక్తి గాయాలు పాలుకాగా... చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి.
కడప జిల్లా వేంపల్లి మండలం టి.వెలమవారిపల్లెలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు 15 విద్యుత్ స్తంభాలు పడిపోగా... పాడి గేదె మృతి చెందింది. ఓ వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. చాలాచోట్ల చెట్లు నేలకొరిగాయి. పంట నష్టం వాటిల్లిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.